Skip to playerSkip to main content
  • 8 years ago
We are planning ysrcp key leader to join in tdp said minister Achenaidu. minister Acheniadu chit chat with media on Tuesday.

వైసీపీ చీప్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలో ఆ పార్టీ నుండి పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలను ప్రోత్సహించేలా టిడిపి ప్లాన్ చేస్తోంది. వైసీపీలో ప్రముఖ నాయకుడి కోసం ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన కలకలం రేపుతోంది. వైసీపీ నుండి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉందని ఈ ప్రకటన మరింత బలాన్ని చేకూర్చింది.
2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని వైసీపీ చీఫ్ జగన్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు పాదయాత్ర చేస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు.
ఇటీవల కాలంలోనే ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అయితే రాజ్యసభ ఎన్నికలు రానున్న తరుణంలో వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడ దక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టిడిపి నాయకత్వవ వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. మంగళవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended