Gautam Sawang on APPSC Scam : ఏపీపీఎస్సీ స్కాంలో తాడేపల్లి పెద్దలతో సహ మాజీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ హస్తం ఉందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఆయన ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీకి ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ కోర్టుకు అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తప్పుడు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ప్రొఫెసర్ ఉదయభాస్కర్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారనే కక్ష పట్టారని మండిపడ్డారు. హాయ్ ల్యాండ్ రిసార్ట్ వేదికగా గ్రూప్-1 పేపర్లు దిద్దే కార్యక్రమం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులుతో పాటు గౌతమ్ సవాంగ్ కూడా శిక్షార్హుడే అని చెప్పారు.
Be the first to comment