Singer Usha Visits Tirumala Srivari Temple Today : తిరుమల శ్రీవారిని గాయని ఉష దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.