Actress Jyothika Visited in Tirumala : తిరుమల శ్రీవారిని హీరో సూర్య సతీమణి, సినీ నటి జ్యోతిక ఇవాళ తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జ్యోతికకు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జ్యోతికను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. కాసేపు ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది.
Be the first to comment