Simhachalam Temple Tragedy : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఘటనాస్థలిలో ఏడుగురు మరణించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.