Huge Flood Water At Edupayala Temple : మెదక్ జిల్లాలో మంజీరా నది ఉద్ధృతికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం గత మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భ గుడి ముందు ఉన్న నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో గర్భగుడిలోకి వెళ్లడం, పూజలు చేయడం కష్టంగా మారింది. అటు భక్తులు కూడా ఆలయానికి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రధాన ఆలయాన్ని మూసివేశారు.
Be the first to comment