Snake Appeared in Shiva Temple on Shivaratri : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓదెల శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. గతంలోనూ ఈ ఆలయంలో నాగుపాము దర్శనమివ్వగా తాజాగా మహాశివరాత్రి పర్వదినం నాడు మరోసారి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో ఇదంతా దేవుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు. నాగదేవత విగ్రహం వద్ద చాలాసేపు నాగుపాము ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగుపామును దర్శించుకున్నారు
Be the first to comment