Kurnool Five sisters Tragedy Story : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బుగ్గతండాకు చెందిన ఐదుగురు అక్కాచెళ్లెళ్ల దీనస్థితిపై ఈటీవీ - ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనాలకు స్పందన లభించింది. వారిని తమ విద్యా సంస్థలో ఉచితంగా చదివించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ముందుకొచ్చారు. వారికి వసతి, పుస్తకాలు, యూనిఫాం అన్నీ తానే భరిస్తానని గోరంట్ల రవికుమార్ తెలిపారు. వారు ఎంత వరకు చదువుకుంటే అంతవరకూ చదివిస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమానికి స్పూర్తిగా తీసుకొని తన వంతు బాధ్యతగా ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పారు.
Be the first to comment