CONTINUOUS ELECTRICITY TO FARMERS: రాష్ట్రంలో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో నాలుగు విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభం, మరో మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత ముఖ్యఅతిథులుగా హాజరై మీడియా సమావేశం నిర్వహించారు.
Be the first to comment