TUNGABHADRA DAM GATES : రాయలసీమ వరప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యామ్ ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్ట్ గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందేనని అల్ట్రా సౌండ్ పరీక్షల్లో తేలింది. మొత్తం 33 గేట్లలో 19 గేట్ల సామర్థ్యం 40 నుంచి 55 శాతానికి తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణుల అభిప్రాయాలతో రైతుల్లో కలవరం మొదలైంది.