Minister Gummadi Sandhya Rani Surprise Inspection at KGBV : పార్వతీపురం మన్యం జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో మంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. సాలూరు మండలం కరాసవలస గ్రామంలోని కేజీబీవీని తనిఖీ చేసిన మంత్రి విద్యార్థులకు పెట్టె భోజనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 152 మంది పిల్లలకు సరిపడా అన్నం, కూరలు వండకపోవడంపై మండిపడ్డారు. మీ ఇంట్లో పిల్లలుకి ఇలానే చాలీచాలని భోజనాలు వండుతారా? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వంట సిబ్బందిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Be the first to comment