Skip to playerSkip to main content
  • 10 months ago
Coaches Detached from Falaknuma Superfast in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు ప్రమాదం తప్పింది. పలాస మండలం సుమ్మాదేవి, మందస రైలు నిలయం మధ్యలో రైలు నుంచి 12 బోగీలు విడిపోయాయి. A1 ఏసీ కోచ్‌ దగ్గర కప్లింగ్‌ దెబ్బతినడంతో 12 బోగీలు విడిపోయాయి. వెంటనే రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వెళ్తుంది. సుమారు రెండు గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రైలు ఇంజన్‌ వైపు ఉన్న బోగీలను మందస రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. బోగీలను జాయింట్‌ చేసిన తర్వాత రైలు హావ్‌డా బయల్దేరనుంది.

Category

🗞
News
Comments

Recommended