SIT Begins Investigation Into Suspicious Death Of Watchman Ranganna : వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ప్రత్యక్షసాక్షి వాచ్ మెన్ రంగన్న అనుమానాస్పద మరణంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. రంగన్న మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహంలోని 20 రకాల అవయవాలను సేకరించి నాలుగు ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు. నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సాంకేతిక పరమైన దర్యాప్తు సిట్ నిర్వహిస్తోంది. "స్లో పాయిజన్" ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది.
Be the first to comment