Businessman Kidnapping And Murder Case : కొనుగోలు చేసిన సరుకుకి సొమ్ము చెల్లిస్తామని రప్పించారు. అతడినే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే ఉద్దేశంతో వ్యాపారిని హత్య చేశారు. సికింద్రాబాద్ విక్రమ్‌పురి కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేశ్ హత్యకేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Be the first to comment