Vallabhaneni Vamsi Case: వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరుల ఆగడాలు సీసీ కెమెరాల సాక్షిగా బయటపడ్డాయి. సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, మరుసటి రోజు కారులో విశాఖ తరలించడం, విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సైతం నిఘా నేత్రాల్లో నిక్షిప్తమయ్యాయి. మరోవైపు తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని ఆయన సతీమణి చెప్పటంతో జైలు అధికారులు బ్యారక్ వద్ద భద్రత పెంచారు.