నాయనమ్మ వద్ద నుంచి తప్పిపోయిన చిన్నారిని సాంకేతికత సాయంతో పోలీసులు తిరిగి ఆమె వద్దకు చేర్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. భీమవరం మండలం చిన్న గొల్లపాలేనికి చెందిన బొర్రా వెంకట నారాయణమ్మ తన మనవడు, మనవరాలతో కలిసి ఆధార్ ఆప్‌డేట్ కోసం భీమవరం హెడ్ పోస్టాఫీసుకు వచ్చారు. అక్కడ్నుంచి ఏడేళ్ల దివ్య తప్పిపోవండతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐ నాగరాజు, ఎస్సై కిరణ్‌కుమార్ వెంటనే బృందాలను ఏర్పాటు చేసి, డ్రోన్ సహాయంతో శోధన చేపట్టి చిన్నారి ఆచూకీ కనుగొన్నారు.
Be the first to comment