AP Cabinet Meeting Decisions : నిషేధిత జాబితా నుంచి భూముల్ని అక్రమంగా తొలగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే కేబినెట్ లోగా దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇంఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ కోసం మంత్రుల కమిటీ కూడా వేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామవార్డు సచివాలయాల రేషనలైజేషన్ చేయాలని తీర్మానించింది.
Be the first to comment