CM Chandrababu Meets Governor Abdul Nazeer : రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాల్పులు విరమిద్దాం అని పాకిస్తాన్ కోరటంతో భారత్ ఒప్పుకుందన్నారు. యుద్ధంలో నష్టపోయిన భారతీయులందరికీ సంతాపం ప్రకటిస్తూ, దేశ భద్రత కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలుపుతూ తీర్మానం చేద్దామని వెల్లడించారు. దేశమే ముందు అనేది అందరి నినాదమని సీఎం వ్యాఖ్యానించారు. దేశానికి కష్టమొస్తే, సంఘటితంగా ఉండటంతో పాటు అందరూ కలసికట్టుగా నడవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.
Be the first to comment