Hyderabad Police on Cyber Frauds in Gujarat : ఓ చోరీ కేసును ఛేదించేందుకు మద్రాస్ పోలీసులు రాజస్థాన్ భరత్ పూర్ వెళ్తారు. అక్కడ నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తారు. నిద్రాహారాలు మాని రోజుల తరబడి తిష్ట వేసి చివరికి నిందితులను పట్టుకుంటారు. ఇదంతా కార్తీ నటించిన ఖాకీ సినిమా కథ. ఇదే తరహాలో సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా రూ. వెయ్యికోట్లు కాజేసిన నేరగాళ్ల కోసం 40 మంది హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుజరాత్‌ను జల్లెడ పట్టారు. 36 మందిని అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. అక్కడి నేరగాళ్ల ఎత్తులు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.
Be the first to comment