JAGAN Tour : జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల అంశం వైఎస్ కుటుంబంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న వేళ మాజీ సీఎం ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో షర్మిల ఉక్కిరిబిక్కిరి చేస్తుండటం తల్లి విజయమ్మ కూడా షర్మిలకు వత్తాసు పలుకుతూ జగన్ చేసింది అన్యాయమనేలా ప్రకటన విడుదల చేయడం వైసీపీ అధినేతకు మింగుడుపడటం లేదు. షర్మిల, విజయమ్మ ప్రకటనలు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
Be the first to comment