గతంలో ఆయన పర్యటన అంటే ప్రజలు బెంబేలెత్తిపోయేవారు. వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. ఇక ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, జనం ఆయణ్ని కలవాలంటే సవాలక్ష ఆంక్షలు ఉండేవి. ఇవన్నీ గతం కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయి. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు, కొందరు ప్రజలను మాజీ సీఎం కలవడం చర్చనీయాంశమైంది. అధికారం మార్పుతో ఎంత మార్పు జరిగిందోనని అక్కడివారు అనుకుంటున్నారు.
Be the first to comment