Tirupati TDP Worker Murder : తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో టీడీపీ కార్యకర్త హత్యని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. వైఎస్సార్సీపీ నాయకులు ఓ దళితుడిని అన్యాయంగా హతమార్చారని ధ్వజమెత్తింది. ఆ పార్టీ నేతల రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను కోరింది. చిల్లకూరు మండలం ముత్యాలపాడుకు చెందిన నారపరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, వంశీ దాయాదులు. వారి కుటుంబాల్లో నెలకొన్న పాత గొడవల కారణంగా సోమవారం సాయంత్రం మహిళల మధ్య వివాదం తలెత్తింది.
Be the first to comment