Guntur Missing Pet Dog Case : పెంపుడు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది శునకాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అలా ప్రేమగా చూసుకునే ఓ పెంపుడు కుక్క తప్పిపోవడంతో ఆ కుటుంబంసభ్యులు ఆందోళన చెందారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో నివాసం ఉండే మోజెస్ అనే వ్యక్తి కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. దానికి మ్యాక్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు.