YSRCP Govt Neglect APSRTC : ప్రభుత్వంలో విలీనం పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన మోసంతో వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. పెరగాల్సిన వేతనాలు పెరక్కపోగా తగ్గిపోయాయి. సదుపాయాలు రద్దై పోయాయి. అపరిమిత వైద్యం కాస్తా పరిమితమైంది. పోనీ అలవెన్సులైనా వస్తాయా అంటే ఆదీ లేదు. ఎన్నోఏళ్లుగా వస్తోన్న నైటౌట్ సహా పలు అలవెన్సులను గత ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. గతంలో ఉన్న ఎన్నో ప్రయోజనాలకు పాతరేసింది. తమ ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం సహా కార్యాచరణకు దిగడంతో ఆశలు పెట్టుకున్నారు.
Be the first to comment