TGSRTC Suspende Employees: సార్ తప్పు చేశాం క్షమించండి. మా కుటుంబం దీనావస్థలో ఉంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి ప్లీజ్..! అంటూ ఆర్టీసీలో రిమూవల్, సస్పెండ్ అయిన ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లను వేడుకుంటున్నారు. తెలియకుండా తప్పులు జరిగాయి. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో తమను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తప్పించారని కన్నీరుమున్నీరవుతున్నారు. తమపై దయచూపి ఒక్కసారి ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారు.
Be the first to comment