SIT Inquiry Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి పోలీసు అతిథిగృహంలో రెండోరోజు సమావేశమైన సిట్ అధికారులు విచారణ విధివిధానాలను రూపొందించారు. మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించే అంశంపై చర్చించారు. కల్తీ నెయ్యి ఘటనలో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించడానికి లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అనంతరం టీటీడీ ఈవోతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలు, లడ్డూ తయారీతో ప్రమేయం ఉన్న టీటీడీ ఉద్యోగులను పోలీసు అతిథిగృహానికి పిలిపించి వివరాలు సేకరించారు.
Be the first to comment