AP Govt Released Flood Compensation : వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ అందించింది. బాధిత ప్రజలకు, పంట నష్టం కింద రైతులకు రూ.602 కోట్లు పరిహారం ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అదే విధంగా 47 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశామన్నారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు ఆర్థికసాయం అందించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
Be the first to comment