BRS Fires on Congress : సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద, సంజయ్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడులకు ఉసిగొల్పుతున్నారని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.