Drones For Vijayawada Sanitation Works: విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో పనులు చేపట్టారు. నిలువ ఉన్న వరద నీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా, డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి చేస్తున్నారు. వందల మంది కార్మికులు చేసే పనిని, డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో చేస్తున్నారు. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగిస్తున్నారు.