VMC Incresing Park Fees Vijayawada : గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టిన తీరు మార్చుకోలేదని సీపీఎం విమర్శించింది. తాజాగా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక పక్షం ప్రజలపై పన్నుల భారం మోపడానికి తహతహలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కుల్లో ప్రవేశ రుసుం వసూలు, స్టేడియాల్లో ఆడే క్రీడాకారుల నుంచి సభ్యత రుసుం పేరుతో ఫీజులు వసూలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
Be the first to comment