Roads Damaged Due to Heavy Rains in Telangana : రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. వరద తీవ్రతకు పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటమునిగిన ప్రాంతాలు సహా దెబ్బతిన్న వాగులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరదల కారణంగా అల్లాడిపోయిన బాధిత ప్రజలను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.