Farmers Happy with Krishna Water in Handriniva Canals : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాల సవ్వళ్లతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొలం ముంగిటే నీరు ప్రవహిస్తున్నా చెరువుకు నింపుకునే అవకాశం లేకుండా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక చేసింది. వరుణుడు సైతం కరుణించడంతో 50 శాతం పైగా చెరువులు పుష్కలంగా నిండాయి. అప్పట్లో ఓట్ల కోసం నీటి రాజకీయం చేసిన చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్యనేత అనంత రైతులకు అన్యాయం చేసి సాగు నీటిని తరలించుకుపోతున్నారని మొరపెట్టుకున్నా కనీసం స్పందించని పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జిల్లాలోని 214 చెరువులను కృష్ణా జలాలతో నింపడానికి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
Be the first to comment