Demolition drive in Mahabubnagar : హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్‌లోనూ ప్రభుత్వభూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. చాలా కాలంగా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపణలున్న సర్వే నెంబర్-523లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. పట్టాలేకుండా, ఉద్దేశపూర్వకంగా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలనే కూల్చి వేసిననట్లు అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చారని... తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని బాధితులు నిరసనకు దిగారు. .
Be the first to comment