Guntur Young Man Excelling in Paintings : పుట్టుకతో వచ్చిన వైకల్యం చిన్నబోయేలా చిత్రకళలో అద్భుత ప్రతిభ చూపుతున్నాడు ఆ కుర్రాడు. అరుదైన చిత్రాలతో అబ్బురపరచటమే కాక డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ లాంటి కోర్సుల్లోనూ పట్టు సాధించాడు. విద్యలోనూ అందరి కంటే ముందుంటూ పలు సంస్థలకు సేవలందిస్తున్నాడు. సాధించాలనే పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చుని నిరూపిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన వేల్పూరి తులసి నారాయణ కథ ఇది.