Hydra Political Heat in Telangana : హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత అంశంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు, కాంగ్రెస్ నేతల నుంచే మొదలుపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నిబంధనలకు అతిక్రమించి నిర్మించిన వాటన్నింటినీ హైడ్రా కూల్చుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయొద్దని బీజేపీ హితవు పలికింది.
Be the first to comment