Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి పడుతున్న వానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Be the first to comment