Skip to playerSkip to main contentSkip to footer
  • 2/16/2023
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ నెల 24 నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది.. దీనికి సంబంధించిన పూజ డేట్స్ కూడా వెల్లడించారు సినిమా మేకింగ్ టీం. ఇది ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్తే... ఇక ఈ సినిమాల్లో ఎన్టీఆర్ డుయల్ రోల్ లో కనిపించనున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తిరుగుతోంది. సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా కథ ఉందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ.. కొందరు ఇదే నేపథ్యంలో సినిమా ఉండనుందని పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాలో తండ్రీ, కుమారుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడని.. పగను తీర్చుకునే కథతో ప్రేక్షకులను అలరించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Recommended