YS SHARMILA TASTING NEERA

  • last year
పాలకుర్తిలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. తాటి కల్లు తాగారు.. గీతాకార్మికుడి కోరిక మేరకు ఆమె కల్లు టెస్టు చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు.. అందులో భాగంగా ఆమెకు ఓ గీత కార్మికుడు కలిసాడు. అతను నడుముకు మోకు కట్టుకుని, చేతిలో కల్లు లొట్టితో ఉన్నాడు. మేడం కాస్త కల్లు రుచి చూడండి అని అతను కోరగా.. ఆమె తాటి కల్లు రుచి చూశారు. కల్లు తాగడం తనకు అలవాటు లేదని, కానీ గీత కార్మికుడు కోరిక మేరకు కొద్దిగా రుచి చూసినట్లు షర్మిల తెలిపారు. వారి సమస్యలు విన్న అనంతరం.. YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.

Recommended