Skip to playerSkip to main content
  • 6 years ago
Pawan Kalyan's brother Nagababu addressed the Janasena party workers meeting. Nagababu said we should have complete faith in Pawan Kalyan and be ready to do any work for him.
#pawankalyan
#nagababu
#janasena
#tollywood
#narasapuram
#ramcharan
#appolitcs
#andhrapradesh

2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొదలు పెట్టినపుడు మాకు ఎవరికీ యాక్సెప్టెన్సీ లేదు. అందుకు కారణం అంతకు ముందు ప్రజారాజ్యం వల్ల జరిగిన చేదు అనుభవమే అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇటీవల ఆయన జనసేన కార్యకర్తల మీటింగులో తన అద్భుతమైన ప్రసంగంతో అభిమానుల్లో ఉత్తేజం నింపారు. జనసేన పార్టీ పెట్టినపుడు ఒక అన్నగా.. మా తమ్ముడు ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి అనిపించింది. నేనైతే యాక్సెప్ట్ చేయలేక పోయాను. జనసేన ఫస్ట్ మీటింగ్ జరుగుతున్నపుడు నేను గోవాలో షూటింగులో ఉన్నాను. షూటింగ్ ఆపి కళ్యాణ్ బాబు స్పీచ్ చూశాను. కరెక్టుగా, జెన్యూన్ గా మాట్లాడారు అనిపించింది. కానీ ఎంత వరకు నిలదొక్కుంటాడు అనే డౌట్ అయితే ఉండి పోయిందన్నారు.
Be the first to comment
Add your comment

Recommended