Telugu movie Oh Baby Success Meet held in Hyderabad.Celebrities like Samantha Akkineni, Rana Daggubati, BV Nandini Reddy, Teja Sajja, Sunitha Tati and others graced at the event. #OhBaby #SuccessMeet #Hyderabad #SamanthaAkkineni #RanaDaggubati #BVNandiniReddy #TejaSajja #SunithaTati
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో థాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా దగ్గుబాటి మాట్లాడుతూ “ఈ స్పెషల్ మూవీని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. ఒక కొరియన్ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా అందంగా తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డికి హ్యాట్సాఫ్'' అన్నారు
Be the first to comment