Skip to playerSkip to main contentSkip to footer
  • 6/26/2018
Pawan Kalyan wish Renu Desai for her second marriage. Pawan Kalyan tweet goes viral

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలయిక చాలా ఆసక్తికరం. బద్రి చిత్రంతో తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ ఆ తరువాత సహజీవనం, వైవాహిక జీవితంతో ఒక్కటయ్యారు. ఆతరువాత వీరిద్దరూ విడిపోవడం, పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడం తెలిసిన సంగతే. ఇదిలా ఉండగా పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లతో పుణేలో నివాసం ఉంటోంది. రేణు దేశాయ్ మరో వివాహం చేసుకోవాలని భావించింది. ఇటీవలే ఆమె నిచ్చితార్ధం కూడా జరిగింది. వరుడి వివరాలని రేణు గోప్యంగా ఉంచింది. రెండవ వివాహంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్న రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
రేణు దేశాయ్ కూడా మరో వివాహం చేసుకునే ఆలోచనని ఆ మద్యన బయటపెట్టింది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చే పట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేయడం, చివరి వరకు ఈ చేతిని వదిలి పట్టకు అని మెసేజ్ పెట్టడంతో రేణు త్వరలో వివాహం చేసుకోబోతోంది అనిఅంతా భావించారు.
అంతా అనుకున్నట్లుగానే ఇటీవల రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.తన నిచితార్థ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా సోషల్ మీడియాలో ధృవీకరించింది.

Recommended