Skip to playerSkip to main content
  • 7 years ago
Rangasthalam completes Successful 50 days. It is memorable movie for Rangasthalam unit
#Rangasthalam

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్ర ఘనవిజయంలో మరో మైలురాయి అధికమించింది. నేటితో రంగస్థలం చిత్రం 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒకప్పుడు అయితే సినిమా ఎన్ని రోజులు ఆడింది అని మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు చిత్రాల విడుదల శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అత్యధిక థియేటర్ లలో విడుదలవుతుండడం వలన ఓ చిత్రం రెండు వారాలు ఆడితే గొప్పగా చెప్పుకుంటున్నారు. తొలి వారంలోనే 80 శాతం వసూళ్లు రాబడుతున్నాయి. దీనితో ఎంత వసూలు చేసింది అని మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రంగస్థలం చిత్రం ఆ రెండు ఘనతలని దక్కించుకుంది.
మార్చి 30 న వేసవి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకుని ప్రభంజనం సృష్టించింది. పల్లెటూరు కథ, స్థానికంగా జరిగే రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కి ఇప్పటికి ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది.
రాంచరణ్ ఈ చిత్రంలో తన ఆహార్యం, నటనతో అబ్బురపరిచారు. ఎటువంటి వంకరలు పెట్టలేని విధంగా రాంచరణ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో సాగింది. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ హాస్య భరితమైన సన్నివేశాలతో అలరిస్తూనే, ఎమోషనల్ సీన్స్ లో గుండెలు పిండేశాడు. సమంత రామలక్ష్మిగా అదరగొట్టేసింది.
దర్శకుడు సుకుమార్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన శైలిలో రాసుకున్న కథ, తనకు మాత్రమే సాధ్యమైన స్క్రీన్ ప్లే తో సుక్కు అద్భుతమైన మ్యాజిక్ చేసాడు. రాంచరణ్ ని అలాంటి పాత్రలో చూపించడం పెద్ద సాహసమే. రంగమ్మత్తగా అనసూయ పాత్రని, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి పాత్రని సుక్కు అద్భుతంగా మలిచారు.
Be the first to comment
Add your comment

Recommended