Jaya Kumar alleged Ram Gopal Varma harassing and dubbed him as "the Harvey Weinsten of Bollywood".
'జీఎస్‌టీ'పై కావాల్సినంత రచ్చ జరుగుతోంది. ఓవైపు మహిళ సంఘాల ఆందోళనలు, ఫిర్యాదులు కొనసాగుతుంటే.. మరోవైపు జయకుమార్ అనే రచయిత కాపీ ఆరోపణలతో రచ్చకెక్కాడు. స్పందించిన ఆర్జీవి.. వాడో దొంగ అంటూ తేల్చిపారేయడంతో జయకుమార్ నుంచి అనూహ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్మలో చాలామందికి తెలియని మరో మనిషి ఉన్నాడని పెద్ద బాంబు పేల్చాడు. రాంగోపాల్ వర్మలో మరో మనిషి ఉన్నాడని చెప్పిన జయకుమార్.. ఆయన్ను బాలీవుడ్ హార్వీ వీన్ స్టీన్‌గా అభివర్ణించాడు. హాలీవుడ్‌లో ఎంతమంది తారల జీవితాలతో ఆడుకున్న ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్‌తో వర్మను పోల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. వర్మ అసహజ శృంగారానికి పాల్పడే వ్యక్తి అని ఆరోపించిన జయకుమార్.. డబ్బు ఆఫర్ చేసి తనను చాలాసార్లు హోటల్ రూమ్స్‌కు రమ్మన్నాడని, లైంగికంగా తనను వేధించాడని ఆరోపించాడు. వర్మ ఆపర్స్‌ను తిరస్కరిస్తూ వస్తున్న కొద్ది తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించాడు. సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీలతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించడం సహజమని, తాను కూడా అలాగే అనుకుని వర్మతో కలిసి పని చేశానని అన్నారు. కానీ ఆయనలో మరో మనిషి ఉన్నాడని జయకుమార్ విమర్శించారు. వర్మ లెక్కలు వేరుగా ఉంటాయని, సందర్భం వచ్చినప్పుడు ఆయన అసలు రంగు బయటపెడుతారని చెప్పుకొచ్చారు. రాంగోపాల్ వర్మ 'హోమో సెక్సువల్' అని తాను చెప్పడం లేదని, కానీ వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతానని జయకుమార్ పేర్కొనడం గమనార్హం. వర్మ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, వర్మ బాధితులంతా ముందుకు వచ్చి #మీటూవర్మ క్యాంపెయిన్ లో భాగమవ్వాలని జయకుమార్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
Be the first to comment