Skip to playerSkip to main content
  • 8 years ago
Power star Pawan Kalyan has been in news ever since his Agnyaathavaasi was officially announced. It's no news that the actor-politician enjoys a huge fan following across the globe.

భారీ అంచనాల మధ్య రిలీజైన అజ్ఞాతవాసి చిత్రంపై డివైడ్ టాక్ వెలువడుతున్న నేపథ్యంలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ఆసక్తికరమైన రివ్యూను అందించారు. కత్తి మహేష్‌ రివ్యూకు ఎన్‌కౌంటర్ ఇస్తూ సినిమా గురించి విశ్లేషణను అందించారు. కత్తి మహేష్‌తో సినీ క్రిటిక్స్ ఓ వైపు సినిమాను ఏకిపారేస్తుంటే ఆది మాత్రం అండగా నిలిచారు.
అజ్ఞాతవాసి లాంటి సీరియస్ కథకు కామెడీ ట్రీట్మెంట్ వేస్తే సినిమా అపహాస్యం అవుతుంది. కథకు చేయాల్సింది చేయక పోగా దాన్ని నాశనం చేస్తే ఎవరూ అప్రిషియేట్ చేయరు. అజ్ఞాతవాసి సినిమా విషయంలో అదే జరిగింది అని మహేష్ కత్తి తన రివ్యూను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఏమని స్పందించారంటే..
అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా మాత్రం చాలా చాలా బాగున్నది. తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలోని పవన్ కల్యాణ్ కామెడీ టైమింగ్, ఈజ్ మళ్లీ అజ్ఞాతవాసిలో చూడవచ్చు.
పవన్ కల్యాణ్ కోసం 10 సార్లు చూడవచ్చు. త్రివిక్రమ్ కోసం మూడు సార్లు చూడవచ్చు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీశర్మ కోసం వీలున్నప్పుడు చూడవచ్చు.
అజ్ఞాతవాసి గురించి ఓ మాటలో చెప్పాలంటే బ్లాక్‌బస్టర్. ఈ చిత్రంలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏమిటంటే.. బోమన్ ఇరానీ చెప్పిన రాజ్యం మీద ఆశలేని వాడికంటే గొప్ప రాజు ఎవరు ఉంటారు అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది.
Be the first to comment
Add your comment

Recommended