Skip to playerSkip to main content
  • 8 years ago
Pawan Kalyan Agnyaathavasi is getting mixed talk from audience. They saying Sentimement scenes and Pawan Kalyan performance are the main assets of film.

అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లుతుంటే.. పవన్ సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటంలో ఆ కిక్కే వేరప్పా!. 'అజ్ఞాతవాసి'పై ఏ అభిమాని నోట విన్నా ఇప్పుడిదే మాట. తెరపై పవన్ ఇమేజ్‌ను శిఖర స్థాయిలో నిలబెట్టే త్రివిక్రమ్ మ్యాజిక్ కోసం వాళ్ల వెంపర్లాట. మరి 'అజ్ఞాతవాసి' వాళ్ల అంచనాలను అందుకుందా?.. బయట టాక్ ఎలా ఉందో చూద్దాం.
అజ్ఞాతవాసి ప్లస్ పాయింట్స్: కుష్బూ-పవన్ సెంటిమెంట్, పవన్ కల్యాణ్ పెర్ఫామెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్: కథా ట్రీట్‌మెంట్, స్క్రీన్ ప్లే
హీరోయిన్లకు ప్రాధాన్యత లేదు.. సినిమాలో పవన్ కల్యాణ్‌ను సరికొత్తగా, ముఖ్యంగా లుక్స్ పరంగా త్రివిక్రమ్ బాగా ప్రెజెంట్ చేయగలిగాడన్న టాక్ వినిపిస్తోంది. నటీనటులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నప్పటికీ.. హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.
ఇక 'అజ్ఞాతవాసి'కి స్క్రీన్ ప్లే మైనస్ అయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. కథకు సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. త్రివిక్రమ్ ఈ రెండు విషయాలపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదంటున్నారు.
Be the first to comment
Add your comment

Recommended