Skip to playerSkip to main contentSkip to footer
  • 1/6/2018
Project Z Producer SK Basheed Fires On Sundeep Kishan. He said Sandeep Kishan was a big cheat.

తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ మీద నిర్మాత ఎస్.కె.బషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడో పెద్ద మోసగాడని, అతడితో సినిమాలు చేయవద్దని, అతడి మూలంగా తాను కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని బషీద్ మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.
సందీప్ కిషన్ నటించిన తమిళ చిత్రం ‘మాయావన్' సినిమా తమిళ ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లాడు. అపుడు సందీప్ కిషన్ నన్ను సినిమా కొనాలని, తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని చెప్పారని.... ఆయన చెబితేనే తాను ఈ సినిమా కొన్నాను. కానీ సినిమా కొన్న తర్వాత అతడే అడ్డుకుని మోసం చేశాడని ఎస్.కె.బషీద్ ఆవేదన వ్యక్తం చేశారు.
అతడి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని, నష్టపోయానని తెలిపారు.
ఓ వైపు సినిమాను నాకు అమ్మి.... మరో వైపు విజయవాడ కేశినేని వాళ్లకు 75 లక్షలకు అమ్మారు. నాకు భయం వేసి వెంటనే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాను. వెంటనే రిలీజ్ కు సినిమా సిద్ధం చేశాను అని ఎస్.కె. బషీద్ తెలిపారు. కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లందరికీ సందీప్ కిషన్ ఫోన్ చేసి ఈ సినిమా విడుదల కాదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశాడని ఎస్.కె.బషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Recommended