Skip to playerSkip to main content
  • 8 years ago
Bithiri Sathi show on Anchor Pradeep Machiraju Drunk and drive case. Pradeep is a popular anchor on telugu television and he was caught during the drunken drive conducted by the Hyderabad police on the eve of new year.

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అంటే... పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా. అయితే ఆ సినిమా విడుదల ముందు టాలీవుడ్లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ అజ్ఞాతవాసంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయింది.
అయితే ‘తీన్ మార్' వార్తలతో తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో పాపులర్ అయిన బిత్తిరి సత్తి తాజాగా తన షోలో ప్రదీప్ ప్రస్తావన తెచ్చాడు. అతడు ఎవరికీ కనిపించకుండా పోయిన వైనాన్ని గుర్తు చేస్తూ బిత్తిరి సత్తి పేల్చిన సెటైర్లు అందరినీ నవ్విస్తున్నాయి.
త్వరలో అజ్ఞాతవాసి సినిమా విడుదలవ్వబోతోంది. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం అనుకున్నాం. కానీ నువ్వు ఇలా అజ్ఞాతంలోకి వెళితే ఎలా? ...... ఎక్కడున్నావ్, త్వరగా వచ్చేయ్ అంటూ బిత్తిరి సత్తి కామెడీ పండించాడు.
తనదైన మేనరిజం, నవ్వించే యాస‌లో యాంకర్ ప్రదీప్‌ను ఒక రేంజిలో ఆడుకున్నాడు బిత్తిరి సత్తి.
డిసెంబర్ 31 అంటేనే ఖుషి దినం. ఆ యాళ కొంచెం సుక్కేసిండు, ఇస్టీరింగ్ పట్టి తిప్పిండు....ఎస్కలేటర్ తొక్కిండు సక్కగ పోయ్ పోలీసోళ్ల ముంగట ఆపిండు, ఎంతపనైపాయే.... అంటూ బిత్తిరి సత్తి ఫన్ క్రియేట్ చేశాడు.
Be the first to comment
Add your comment

Recommended