Skip to playerSkip to main contentSkip to footer
  • 12/29/2017
The Lok Sabha today passed the hugely contentious bill that criminalises instant triple talaq and makes it punishable by up to three years imprisonment for the husband, a development hailed by the government as “historic” but disapproved of by a section of the opposition.

ముస్లీం మహిళలకు తీవ్ర చేటు కలిగిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోకసభ ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ జరిగింది. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లును లోకసభ ఆమోదించింది. ఈ బిల్లుపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా విపక్షాలు చేసిన సవరణల ప్రతిపాదనలు వీగిపోయాయి. అసదుద్దీన్ పది ప్రతిపాదనలకు మద్దతు తెలపగా, వ్యతిరేకంగా 241 మంది ఓటు వేశారు. సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించింది.

అసదుద్దీన్‌తో పాటు బీజేపీ ఎంపి హరి, కాంగ్రెస్ ఎంహి సుష్మితా దేవ్, సీపీఎం సభ్యులు సంపత్ ఇచ్చిన సవరణలపై ఓటింగ్ నిర్వహించారు. సవరణలు అన్నీ వీగిపోయాయి. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ మాట్లాడారు. ముస్లీం మహిళల కోసమే ఈ బిల్లును తీసుకు వచ్చినట్లు చెప్పారు. ముస్లీం మహిళల హక్కుల కోసం అందరు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదని, మానవత్వానికి సంబంధించింది అన్నారు. కాగా, ఈ బిల్లుకు ఇక రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో బీజేపీకి సొంతగా బలం లేదు. ఇతర పార్టీలపై ఆధారపడాలి.


Category

🗞
News

Recommended