చెన్నై నుంచి విజయవాడ వరకూ ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నేటి నుంచి నరసాపురం వరకూ నడిచేలా మార్పు చేశారు. దీంతో నరసాపురం నుంచి చెన్నైకు ప్రయాణించే వందే భారత్ రైలును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇవాళ మధ్యాహ్నం 1.30కు ప్రారంభించారు. నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్లలో ఈ రైలుకు కొత్తగా హాల్ట్ లు ఇచ్చారు. అలాగే చెన్నై నుంచి నరసాపురానికి వచ్చే రైలు కూడా ఈ స్టేషన్లలో ఆగనుంది. నరసాపురం-చెన్నైవందేభారత్ రైలుకు జనవరి 11 వరకూ తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు.
The Vande Bharat Express, earlier running between Chennai and Vijayawada, has now been extended up to Narasapuram. Union Minister Bhupathiraju Srinivasa Varma inaugurated the service today at 1:30 PM.
Be the first to comment