Director Boyapati Srinu Casted His Vote at Pedakakani: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానికి చేరుకొని జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఏపీ వ్యాప్తంగా ‘పరిషత్’ ఎన్నికలపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల బారులు తీరారు. ఇదిలా ఉండగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా, తిరుపతి జిల్లాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రౌడీలు అక్కడికి వచ్చారు.